
తమిళంలో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో సూర్య. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్’. ఈ సినిమా హ్సూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. స్క్రీన్ ప్లేతో ప్రతి సారి మేజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాని మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో భాగంగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ని మూడు రోజుల క్రితం రిలీజ్ చేసారు.
ఈ టీజర్ కి తమిళ్ లో సూపర్బ్ క్రేజ్ వస్తోంది. అలాగే తెలుగు వాళ్ళలో కూడా సూర్యకి మంచి క్రేజ్ ఉండడం వలన ఈ మూవీ ఫస్ట్ టీజర్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందరినీ ఆకట్టుకున్న ఈ మాస్ టీజర్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే యు ట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడం వలన తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఆడియోని ఈ నెలాఖరున రిలీజ్ చేయనున్నారు.
సూర్య ‘మాస్’ తమిళ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి