
‘అంజాన్’ సినిమా కోసం తమిళ హీరో సూర్య పాట పాడుతున్న సంగతి తెలిసిందే. యువన్ శంకర్ రాజా సంగీతంలో హీరోయిన్ కం సింగర్ ఆండ్రియాతో కలసి ఏక్.. దో.. తీన్.. అంటూ సాగే పాటను పాడాడు. సూర్య ఒక సినిమా కోసం పాడడం ఇదే తొలిసారి. ‘అంజాన్’ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. కాని అందరి దృష్టి సూర్య పాడిన ఏక్.. దో.. తీన్.. మీద మాత్రమె ఉంది. ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూర్య సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో సికందర్ పేరుతో విడుదల అవుతుంది. తమిళ ఆడియో జూలై 22న, తెలుగు ఆడియో జూలై 31న విడుదల అవుతున్నాయి. తెలుగులో కూడా స్వయంగా పాడతాడో? లేదో? తెలియాల్సి ఉంది. ఇటివల విడుదలైన ట్రైలర్ యుట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.