దీపావళికి విక్రమ్ – సూర్యల ’24’

Surya_Vikram
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’24’ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ఇప్పటినుండే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘మాస్’ షూటింగ్ పూర్తయిన తర్వాత ’24’ షూటింగ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి దీపావళికి సినిమాకు విడుదల చేయాలని విక్రమ్, సూర్యలు భావిస్తున్నారు.

‘మనం’ వంటి సూపర్ డూపర్ క్లాసికాల్ హిట్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య నిర్మాతగా మారుతుండడం విశేషం. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో స్వయంగా నిర్మిస్తున్నారు. ‘మనం’ సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ సినిమాకు సైతం వర్క్ చేస్తున్నారు.

Exit mobile version