
యంగ్ హీరో నిఖిల్ ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుసగా కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ తన తదుపరి సినిమా ‘సూర్య vs సూర్య’ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 1న రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా నిఖిల్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం నిఖిల్ తన సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు ఉదయం మీడియా సమక్షంలో రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఇంకా సినిమా గురించిన ఆసక్తికర విషయాలను కూడా ఆ సమావేశంలో తెలియజేయనున్నాడు. ‘సూర్య vs సూర్య’ సినిమాలో నిఖిల్ ఓ స్టూడెంట్ లా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిఖిల్ గత రాత్రి 2 గంటల వరకూ నైట్ ఎఫెక్ట్ లో వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేసారు.