నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతిని తట్టుకోలేక అతని వదిన మరణించారు. సోమవారం ముంబైలో సుశాంత్ దహన సంస్కారాలు జరుగుతుండగా… బీహార్‌లో అతని అన్నగారి భార్య కన్నుమూశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సుశాంత్ మరణించాడని తెలియగానే అతని వదిన తీవ్రంగా కలతచెంది తినడం మానేశారు. సుశాంత్ వరుస సోదరుని భార్య సుధా దెని బీహార్‌లోని పూర్ణియాలో ఉంటున్నారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త వినగానే ఆమె ఆహారం, నీరు తీసుకోవడం మానేశారు. సుశాంత్ మరణంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబైలో సుశాంత్‌కు తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో పూర్ణియాలో సుధ ఊపిరివదిలారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
