టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుయోధన’. డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వై.ఎస్.మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సాయి కుమార్‌తో పాటు సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో మెరవనున్నారు. బోసుబాబు నిడుమోలు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తోంది.
‘సుయోధన’ సినిమా అవుట్‌పుట్ పట్ల నిర్మాత బోసుబాబు నిడుమోలు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అద్భుతమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే టీజర్, ట్రైలర్, పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఇక ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందిస్తుండగా.. స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. టెక్నికల్ పరంగా చూస్తే.. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ కానున్నాయి. మార్చి 27న ప్రముఖ పంపిణీ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ‘సుయోధన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
