
మెగా వారసుడు వరుణ్ తేజ్, పూజ హెడ్గే జంటగా నటిస్తున్న ‘ముకుంద’ స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ అందమైన లొకేషన్లలో ఒక పాటను చిత్రీకరించారు. మూవీ యూనిట్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు.
‘స్విట్జర్లాండ్ లో పాట చిత్రీకరణ పూర్తయింది. బ్యాక్ టు హైదరాబాద్. ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదలకు సరైన సమయంలో చేరుకున్నాను. ‘ అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల తేది ప్రకటించనున్నారు.