మెగాస్టార్‌ ‘సైరా’ ఇక నాలుగు రోజుల్లో.. !

Sye Raa

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం టాకీ పార్ట్ త్వరలో పూర్తి కానుంది. ఇక కేవలం మరో నాలుగు రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఆ నాలుగు రోజుల్లో షూట్ చెయ్యబోయే సన్నివేశాల్లో సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ అందరూ ఉంటారట. అందుకే అందరీ డేట్స్ కోసం వెయిట్ చేస్తోంది చిత్రబృందం.

కాగా ‘సీజీ మరియు విఎఫ్ ఎక్స్’ వర్క్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి అవ్వడానికి దాదాపు నాలుగు నెలలు సమయం పట్టనుంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ సరసన నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version