ప్రస్తుతం భారతదేశం అంతటా ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం సినీ ప్రియులే కాకుండా, సామాన్య ప్రజలు సైతం ఈ సినిమాను వీక్షించేందుకు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పుడు కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక భారీ మూవ్‌మెంట్‌గా మారిపోయింది.
నిన్న అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ ఈ బాలీవుడ్ సీక్వెల్‌ను ప్రశంసించగా, తాజాగా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. రణవీర్ నటనను ‘మాస్టర్‌క్లాస్’ అని అభివర్ణించిన తారక్, భారతీయ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాను అందించినందుకు చిత్ర బృందానికి సెల్యూట్ చేశాడు. రణవీర్ సింగ్ నటన అద్భుతమని, దర్శకుడు ఆదిత్య ధర్ తన దార్శనికతతో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో పటిష్టంగా మలిచారని ఆయన కొనియాడాడు.
ఈ చిత్రంలో నటించిన ఇతర నటుల గురించి ప్రస్తావిస్తూ.. మాధవన్ తనదైన శైలిలో అదరగొట్టారని, సంజయ్ దత్ మరియు అర్జున్ రాంపాల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. శశ్వత్ సచ్‌దేవ్ అందించిన సంగీతం సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆయన ప్రశంసించాడు.
A big salute to the team of #DhurandharTheRevenge for delivering a storm to Indian audiences.
Ranveer sir @RanveerOfficial is not just breathtaking…. He delivered an absolute masterclass on screen.
It takes conviction and fearless vision to mount a film like this and Aditya…
— Jr NTR (@tarak9999) March 19, 2026
