స్పోర్ట్స్ పై అభిప్రాయాలు పంచుకున్న లక్ష్మీ మంచు – తాప్సీ

Manchu_Lakshmi_Taapsee
ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ అందరితోనూ బాగా రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేస్తారు, కానీ బాగా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువగానే ఉంటారు. అలాంటి తక్కువ ఫ్రెండ్స్ లిస్టులో తాప్సీ – లక్ష్మీ మంచు ఉంటారు. తాప్సీ హీరోయిన్ గా పరిచయమైన ‘ఝుమ్మంది నాదం’ సినిమా మంచు వారి బ్యానర్ లోనే చేసింది. అప్పటి నుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్.

వీరిద్దరూ రీసెంట్ గా సోషల్ నెట్వర్క్ అయిన ట్విట్టర్ లో ఏషియన్ గేమ్స్ గురించి వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా అసలు ప్రాముఖ్యత ఇవ్వని కొన్ని సూపర్బ్ స్పోర్ట్స్ గురించి చర్చించారు. దాంతో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్ అలా ప్రాముఖ్యత లేని స్పోర్ట్స్ గురించి ప్రస్తావిస్తే ఎవరన్నా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది.

తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ మరియు తమిళ సినిమాలతో బిజీ గా ఉంటే, మంచు లక్ష్మీ మాత్రం ‘బుడుగు’ సినిమాతో బిజీగా ఉంది.

Exit mobile version