కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో యష్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ‘తబాహి’ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, కేవలం ఆడియో రూపంలో మాత్రమే ఈ సాంగ్‌ను వారు రిలీజ్ చేయడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, విశాల్ మిశ్రా సంగీతం అందించడంతో పాటు పాడారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను మార్చి 19న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
