
సిద్ధార్థ్.. తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు ప్రధాన సినీ పరిశ్రమల్లో నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇక గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తమిళంలో విభిన్న చిత్రాలతో వెళుతున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతోన్న సిద్ధార్థ్ తాజాగా తన సొంత ప్రొడక్షన్ ద్వారా ‘జిల్ జంగ్ జక్’ అనే సినిమాతో మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు.
సిద్ధార్థ్ సొంత బ్యానర్‌పై రూపొందుతోన్న జిల్ జంగ్ జక్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీరజ్ వైడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సిద్ధార్థ్ ఒరిజినల్ స్టైల్‌కు భిన్నంగా యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోంది. ఇక 2012లో లఫ్ ఫెయిల్యూర్ అనే ద్విభాషా చిత్రంతో నిర్మాతగా మారిన సిద్ధార్థ్, మళ్ళీ మూడేళ్ళకు తన సొంత బ్యానర్‌లో కొత్త సినిమాను మొదలుపెట్టడం విశేషంగా కనిపిస్తోంది. మరి మొదటి సినిమాతో మోడరేట్ సక్సెస్ అందుకున్న సిద్ధార్థ్ రెండో అటెంప్ట్‌లో సూపర్ హిట్ కొడతారా అన్నది చూడాలి!