టాక్.. ఈ ట్రెండ్ కి బాలయ్య బ్రేక్? సింహం సింగిల్ షేడ్ లోనే..?

Nandamuri-Balakrishna

మన టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో తన కెరీర్ 111వ సినిమా కూడా ఒకటి. తన బ్లాక్ బస్టర్ హిట్ వీర సింహా రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో బాలయ్య తన రొటీన్ ట్రెండ్ కి బ్రేక్ వేసినట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది.

బాలయ్య కంబ్యాక్ చిత్రం ‘అఖండ’ నుంచే చూసుకున్నా డ్యూయల్ రోల్స్ అలాగే డ్యూయల్ షేడ్స్ లోనే మొన్నటివరకు సినిమాలు వచ్చాయి. అయితే ఈ ట్రెండ్ కి బాలయ్య బ్రేక్ వేసినట్టు ఇపుడు తెలుస్తుంది. కేవలం ఒక్క షేడ్ లోనే బాలయ్య ఈసారి కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది.

భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేయలేదు కానీ రెండు వేరియేషన్స్ ని బాలయ్య సెట్ చేశారు. మరి ఇది కూడా లేకుండా అంటే నెక్స్ట్ సినిమాకి డెఫినెట్ గా కొత్త స్టెప్పే అనుకోవాలి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version