టాక్ : మరోసారి రిపీట్ కానున్న ‘టిల్లు’ కాంబో ?

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీకి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.

డీజే టిల్లు తరువాత తాజాగా టిల్లు స్క్వేర్ కూడా సక్సెస్ టాక్ తో కొనసాగుతుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం మరొక్కసారి టిల్లు కాంబినేషన్ రిపీట్ కానుందట. త్వరలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే మరొక మూవీ ఉంటుందని, దానికి సంబంధించి రాబోయే మరికొద్దిరోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు.

Exit mobile version