
మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా చెలామణీ అవుతోంది. ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది, అది కాకుండా మహేష్ బాబు సరసన నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘ఆగడు’ సెప్టెంబర్ 19న విడుదల కావడానికి సిద్దంగా ఉంది. సౌత్ ఇండియాలో బాగా క్రేజ్ ఉన్న తమన్నా సౌత్ లోనే దాదాపు సెటిల్ అయ్యింది.
కానీ తమన్నా తన సొంత ప్లేస్ అయిన ముంబాయి పై మరింత మక్కువని పెంచుకుంది. తమన్నా ఎప్పుడన్నా ముంబాయి నుంచి యూరప్ లేదా ఇతర ప్రదేశాలాకు ట్రావెల్ అవుతున్నప్పుడు కింద సిటీని చూసి బాగా మిస్ అవుతున్నానని ఫీలవుతుందట. అలాగే ‘ఐ మిస్ యు’ ముంబాయి అని అంటుందట.
సౌత్ లోనే కాకుండా తమన్నా ప్రస్తుతం తమిళంలో రజినీ మురుగన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.