
ప్రభాస్, రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘బాహుబలి’ సినిమా తనకు మంచి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. రామ్ చరణ్ ‘రచ్చ’, నాగ చైతన్య ‘100% లవ్’ సినిమాలు తప్పితే మిల్కీ బ్యూటీ తమన్నాకు తెలుగులో పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు లేవు. ప్రస్తుతం తమన్నాకు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. ఆ లోటు ‘బాహుబలి’ భర్తీ చేస్తుందని గట్టి నమ్మకంతో ఉంది తమన్నా. రాజమౌళి గత రికార్డు చూస్తే హిట్ గ్యారెంటీ అంటుంది.
కెరీర్ ఆరంభం నుండి సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తమన్నా వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇతర హీరోయిన్లు సక్సెస్ రేట్, హిట్ కాంబినేషన్ అంటూ ముందుకు వెళ్తుంటే.. మిల్కీ బ్యూటీ మాత్రం తన అందంతో ప్రేక్షకులలో క్రేజ్ నిలుపుకుంటుంది. హీరోయిన్ గా ఆమె సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇటివల కాలంలో తెలుగు, హిందీ భాషలలో తమన్నా చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆమెపై ప్రెజర్ పెరుగుతుంది. ముఖ్యంగా అగ్ర హీరోల సరసన తమన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు సాధించలేదు.