వివేక్ ఒబెరాయ్ సినిమాలో నటించడం లేదు – తమన్నా

Tamanna
తుహిన్ సిన్హా నవల ‘అఫ్ లవ్ అండ్ పాలిటిక్స్’ ఆధారంగా తెరకెక్కనున్న ఓ హిందీ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ సరసన నటించడానికి మిల్కీ బ్యూటీ తమన్నా సంతకం చేసిందంటూ గత రెండు మూడు రోజుల నుండి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిని తమన్నా ఖండించింది.

మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా.. వివేక్ ప్రధాన పాత్రలో రూపొందబోయే చిత్రంలో నటించడం కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు జరగలేదు. అని తమన్నా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తున్నారు. రవితేజ, సంపత్ నంది కలయికలో తెరకెక్కనున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తమన్నా చివరగా హిందీలో నటించిన మూడు చిత్రాలు పరాజయం పాలవడం గమనార్హం.

Exit mobile version