
ఈ సంవత్సరం ‘లెజెండ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయనున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసారు.
కానీ తాజా సమాచారం ప్రకారం తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఈ చిత్రానికి సంబందించిన వారిని అడిగితే వారు కూడా దాదాపు అవుననే అంటున్నారు. మరి ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన జోడీ కట్టే భామ ఎవరా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడం వలన ఈ చిత్ర టీం నవంబర్ నుంచి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.