‘బాహుబలి’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న తమన్నా

Tamannaah
సౌత్ ఇండియన్ స్టార్ట్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఒక నెల కంటిన్యూ బిజీ షెడ్యూల్ ని పూర్తి చేసి షార్ట్ బ్రేక్ తీసుకుంది. గత నెల రోజులుగా తమన్నా సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పీరియడ్ ఫిల్మ్ ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీ గా ఉంది. ఈ షెడ్యూల్ పూర్తవడంతో తమన్నా ఈ నెల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీ తో హాలిడేస్ ఎంజాయ్ చేయనుంది.

ఒక తర్వాత తమన్నా మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇది కాకుండా తమన్నాకి పలు ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటె ఈ షార్ట్ బ్రేక్ వల్ల తమన్నా తన బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి, వాటికి సంబందించిన షూటింగ్స్ చేయడానికి చాన్స్ ఉంటుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ప్రభాస, రానా, అనుష్కలతో పాటు తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘బాహుబలి’ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటిది 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది.

Exit mobile version