ఉలగనాయగన్ సరసన మిల్క్ బ్యూటీ.?

Tamannaah
కాలేజీకి వెళ్ళాల్సిన రోజుల్లోనే ఫేస్ కి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరి స్టార్ హీరోస్ తో సినిమాలు చేసి వరుస విజయాలను అందుకొని సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా కొనసాగుతోంది తమన్నా. ఇప్పటి వరకూ ఎక్కువగా గ్లామరస్ పాత్రలు, అడపాదడపా కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసిన తమన్నా ఈ ఏడాది చేసిన బాహుబలి సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యి తనకి ఎక్కడలేని గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఈ సినిమాతో తమన్నాని మరో అనుకోని వరం వరించింది. అదే సౌత్ ఇండియన్ లెజండ్రీ హీరో సరసన నటించే అవకాశం కొట్టేయడం.. అతనెవరో కాదు ఉలగనాయగన్ అలియాస్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. సీనియర్ డైరెక్టర్ మౌళి రాసిన కథతో కమల్ హాసన్ తన తదుపరి సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాలో కమల్ కి జోడీగా తమన్నాని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే క్లారిటీ రానున్న ఈ సినిమాకి కూడా చీకటి రాజ్యం ఫేం రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ఇది కాకుండా తమన్నా నటించిన బెంగాల్ టైగర్ నవంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అలాగే నాగార్జున – కార్తీలతో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా చివరి దశలో ఉంది.

Exit mobile version