‘బ్రూస్‌లీ’లో తమన్నా స్పెషల్ సాంగ్ లేదట..!

tamanah

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి పెద్ద సినిమాల తర్వాత ఆ స్థాయి అంచనాలతో వస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్స్‌తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఈ నెల్లోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోనుంది.

ఇక వీటన్నింటికంటే ఎక్కువ ఆసక్తి రేకెత్తించిన విషయం.. చిరు ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయడం. ఈ విషయం అనౌన్స్ అయిన రోజునుంచే సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవ్వడమే కాక, చిరు చేయబోయే ఓ స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నటించనుందనే వార్తలు బయలుదేరాయి. ఇక బ్రూస్‌లీ సినిమాలో నటించే విషయమై తమన్నా కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. బ్రూస్‌లీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, ఇది తప్పుడు సమాచారమని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.

Exit mobile version