
దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తా అని చివరకు డేట్స్ అన్ని క్రాస్ అవ్వడం.. దాంతో విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకోవడం జరిగిపోయాయి. అయితే విజయ్ సేతుపతి పాత్రలో మరో తమిళ హీరో ఆర్యను తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నిజంగానే ఈ సినిమాలో ఆర్య నటిస్తోన్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. మరి బన్నీ పుష్ప కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

