నిర్మాత మండలికి 144 సెక్షన్ !

vishal

తమిళ యాక్షన్ హీరో విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ తన భాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదని, కొందరు తమిళ నిర్మాతలు విశాల్ ను నడిగర్ సంగం లోకి రానివ్వకుండా కార్యాలయానికి తాళం వేశారు

కాగా విశాల్ ఆ తాళాలను తొలగించే యత్నం చేస్తుండగా విశాల్ ను అరెస్ట్ చేసిన పోలీస్ లు ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో విశాల్ ని విడుదలచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తమిళ్ పోలీస్ లు తమిళ నిర్మాత మండలి భవనం వద్దకు ఎవరూ వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు.

Exit mobile version