
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇవ్వడమే కాకుండా తనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. ఈ సినిమా ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో రీమేక్ అవుతోంది. ఇప్పటికే కన్నడలో సుమన్, కృతి కర్బందా జంటగా ‘తిరుపతి ఎక్స్ ప్రెస్’ అని సెట్స్ పై ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ కానుంది. ‘ఒక విచిత్రం’, ‘గుండెల్లో గోదారి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆది తమిళంలో హీరోగా నటించనున్నాడు. మిగిలిన నటీనటులు మరియు టెక్నికల్ టీం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథలో అన్ని భాషల్లో హిట్ అయ్యేంత దమ్ము ఉందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.