
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యాక్షన్ – కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాలోని చాలా ఎపిసోడ్స్ మరియు రెండు పాటలని కూడా షాట్ చేసేసారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ని ఢీ కొట్టనున్న విలన్ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ ని ఫైనలైజ్ చేసారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ కుమారుడైన అరుణ్ విజయ్ ని రామ్ చరణ్ సినిమాలో విలన్ గా ఎంపిక చేసారు. ఇటీవలే తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘ఎన్నై అరింధాల్(తెలుగులో ఎంతవాడు గాని)’ సినిమాతో అరుణ్ విజయ్ కి మంచి పేరు వచ్చింది.
అరుణ్ విజన్ ని ఫైనలైజ్ చేయడమే కాకుండా తన పై వచ్చే సీన్స్ ని కూడా షూట్ చేస్తున్నారు. గత వారం స్టార్ట్ అయిన లేటెస్ట్ షెడ్యూల్ లో అరుణ్ విజయ్ జాయిన్ అయ్యాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపిస్తాడు, అందుకోసమే థాయ్ ల్యాండ్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. రామ్ చరణ్ సిస్టర్ గా కృతి కర్భంద కనిపించనున్న ఈ సినిమాలో నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 15న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.