50 లక్షలు విరాళం ఇచ్చిన సూర్య ఫ్యామిలీ

Surya_karthi_vishal
హుదూద్ సైక్లోన్ చేసిన విలయ తాండవం వలన వైజాగ్ తో పాటు, ఉత్తరాంధ్రలోని 4 జిల్లాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి అతీతంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు వివివిగా విరాళాలు ఇస్తున్నారు. కేవలం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలు వూరు హీరోలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. అందులో ముందుగా సూర్య కుటుంబం మరియు విశాల్ ఉన్నారు.

సూర్య ఫ్యామిలీ నుంచి మొత్తంగా 50 లక్షల డొనేషన్ వచ్చింది. అందులో సూర్య 25 లక్షలు, కార్తీ 12.5 లక్షలు, జ్ఞానవేల్ రాజా 12.5లక్షలు విరాళంగా ఇచ్చారు. వీరితో పాటు తమిళ హీరో విశాల్ కూడా సిఎం రిలీఫ్ ఫండ్ కి 15లక్షలు విరాళం ఇచ్చాడు. వేరిని చూసి పలువురు తమిళ హీరోస్ కూడా వారి సహాయాన్ని అందించే అవకాశం ఉంది.

వీరు కాకుండా ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, కృష్ణ, విజయ నిర్మల, రవితేజ, ప్రకాష్ రాజ్, రామ్ మరియు బ్రహ్మానందంలు సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇచ్చారు.

Exit mobile version