ఎన్టీఆర్ ‘టెంపర్’ తమిళంలో కూడా !

Vishal1
ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం ఇప్పటికే హిందీలోసింబా పేరుతో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చింది. పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి హిందీలో సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.125 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి.. ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.

కాగా తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ ‘అయోగ్య’. మరి తెలుగు మరియు హిందీ లాగే తమిళ్ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘అయోగ్య’ చిత్రబృందం పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను మలుస్తున్నారుట.

Exit mobile version