రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ చాలా ఏరియాల్లో ఇప్పటికే లాభాల బాట పట్టింది.
కాగా తాజాగా ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఇక ఈచిత్రం అటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.
మొత్తానికి బాక్సాపీస్ వద్ద విజయ్ దేవరకొండ మరోసారి తన స్టార్ డమ్ అంటే ఏంటో చూపిస్తున్నాడు.