
‘బాహుబలి’ ఆడియో లాంచ్ వాయిదాపడడం సినీ ప్రియులకు బాధకలిగించే విషయమే. అయితే తెలుగు సినిమా ప్రేక్షకుడిగా ఈ నిర్ణయాన్ని ఆమోదించి తీరాలి. గతంలో ఎన్నో వేడుకలలో తొక్కిసలాట కారణంగా ఎందరో గాయపడ్డారు. ‘బాద్ షా’ వేడుకలో అయితే తారక్ అభిమాని ఒకరు తొక్కిసలాట కారణంగా ప్రాణాలు విడిచారు.
భద్రతా కారణాల దృష్ట్యా బాహుబలి ఆడియోని వాయిదా వేశామని, అభిమానుల సంరక్షణే ఈ తమకి ముఖ్యమని దర్శకుడు, నిర్మాత తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాహుబలి బృందం మంచి నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది. బాహుబలి క్రేజ్ మమోలుగా లేని కారణంగా ఏకంగా 25000 మంది అభిమానులు వేడుకకు హాజరయ్యే అవకాశాలు వున్నాయని, వారిని హ్యాండిల్ చెయ్యడం పోలీసులకు చాలా కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నారు.