‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ పై హైప్ పెంచేసిన ఆడియో టీజర్

Subramanyam-for-Sale
మొదటి సినిమా అయిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతోనే హిట్ అందుకొని మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్, మాస్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. సాయిధరమ్ తేజ్ కి మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజునే ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్ కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెట్టాడు.

దిల్ రాజు అండ్ టీం ఈ సినిమాని సెప్టెంబర్ 24న రిలీజ్ చెయ్యాలని, అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చెయ్యాలని డేట్స్ ఫిక్స్ చేసారు. అందులో భాగంగానే త్వరలోనే ఆడియో రిలీజ్ అంటూ రీసెంట్ గా ఓ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో సాయి ధరమ్ తేజ్ ని చూపించిన విధానం, అతను వేసిన మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో హరీష్ శంకర్ సాయి ధరమ్ తేజ్ ని అభిమానుల్లో ఊపును పెంచేలా చూపడంతో మెగా అభిమానుల్లో, సినీ అభిమానుల్లో ఈ సినిమాపై హైప్ ని పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుండడంతో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సాయిధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో రిలీజ్ టీజర్

Exit mobile version