సాయిధరమ్ తేజ్ , అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ఆశలన్నీ ఈ చిత్రం పైనే పెట్టుకున్నాడు ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్ అవ్వనుందని తెలుస్తుంది .ఈ జంట చూడడానికి కూడా చాలా బాగున్నారు ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రై లర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది . డైరెక్టర్ కరుణాకరన్ తేజుని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్ చేస్తాడోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిచాడు .. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకులముందుకు రానుంది . తేజ్ ఈ చిత్రంతోనైనా విజయం సాధిస్తాడో లేదో చూడాలి
