నాక్కూడా కొత్త తరహా కథల్లో నటించాలనుంది – తేజ్

sai dharam tej2

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ దగ్గరనుండి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’ సినిమా వరకు వరుసగా హిట్స్ కొడుతూ మినిమమ్ గ్యారింటీ హీరో అనిపించుకున్నాడు. ఓ దశలో స్టార్ హీరోలకే పోటీ ఇచ్చేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత నుంచి తేజ్ కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ‘తిక్క’ సినిమాతో మొదలు పెడితే వినాయక్ తీసిన ‘ఇంటిలిజెంట్’ వరకూ తేజ్ సినిమాలు చూసి మెగా అభిమానులు కూడా నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలో తేజ్ నటించిన ‘తేజ్.. ఐ లవ్ యు’ చిత్రం జూలై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్ర విజయం తేజ్ కెరీర్ కి చాలా కీలకం కానుంది.

అయితే ‘ తేజ్ ఐ లవ్ యు’ చిత్ర ప్రెస్ మీట్లో తేజ్ మాట్లాడుతూ “ఎప్పుడూ రొటీన్‌ కమర్షియల్ కథల్నే కాకుండా కొత్త తరహా కథల్ని కూడా ఎంపిక చేసుకోమని అభిమానులు, శ్రేయోభిలాషలు నాకు చెప్తుంటారు. నిజానికి నాక్కూడా కొత్త కథల్ని, కొత్త తరహా చిత్రాలను చేయాలని వుంటుంది. కానీ కొన్ని కారణాలు వల్ల అలాంటి కథను వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం కొత్త తరహా కథ ఏది వచ్చినా చేస్తానని తేజ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version