తేజ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ ?

teja
వరుస పరాజయాలతరువాత కొంత కాలం విరామం తీసుకొని దగ్గుబాటి రానా కథానాయకుడుగా తేజ తెరకెక్కించిన చిత్రం’ నేనే రాజు నేనే మంత్రి’ . ఈ సినిమా విజయం సాధించడంతోపాటు మంచి కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది . ఇక ఈ సినిమా వరుస సినిమాలతో బిజీ అవుతాడనుకున్న డైరెక్టర్ తేజ దానికి తగట్లుగానే ఈ సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా ని ప్రారంభించాడు అనివార్య కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది . దీనితరువాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమాని తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు అనుకున్నట్లు గానే ఆ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయిన కొద్దీ రోజులకే ఆ సినిమా కి నేను న్యాయం చేయలేనని చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు తేజ . ఇక ఈ సినిమాల తరువాత తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో విజయాన్ని ఇచ్చిన రానా తో మళ్ళి సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి ఈ సినిమా ఫై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలుబడలేదు .

ఇక ఇప్పుడు తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి . వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నారట తేజ . ఈ సినిమా సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం . ప్రస్తుతం సాయి శ్రీనివాస్ నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా తరువాత తేజ సినిమాని మొదలుపెట్టే అవకాశం ఉంది .

Exit mobile version