మన తెలుగు సినిమా నుంచి వచ్చి సెన్సేషనల్ సక్సెస్ సాధించిన కొన్ని సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేసిన సూపర్ హీరో చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి దీనికి సీక్వెల్ జై హనుమాన్ (Jai Hanuman) ఈ 2025 లోనే రావాల్సి ఉంది కానీ సాధ్య పడలేదు. అయితే ఈ సినిమాపై ఓ షాకింగ్ రూమర్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది.
Teja Sajja out from Jai Hanuman – జై హనుమాన్ నుంచి తేజ బయటకి?
హను మాన్ సాధించిన హిట్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు కానీ ఈ తేజ సజ్జ కూడా కీలకం. అయితే తాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు రూమర్స్ మొదలయ్యాయి.
ఇందులో నిజం లేదా?
జై హనుమాన్ (Jai Hanuman) నుంచి తేజ తప్పుకున్నాడు అనే మాటలో ఎలాంటి నిజం లేదు అనేందుకే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది వరకే మేకర్స్ సహా తేజ కూడా చెప్పాడు. జై హనుమాన్ లో తన పాత్ర తక్కువ ఉంటుంది, ఆ సినిమాలో రిషబ్ శెట్టి ప్రధానం అని చెప్పారు. సో ఎలాగో తేజ సజ్జ రోల్ తక్కువ సేపే ఉంటుంది అని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. పైగా హను మాన్ లాంటి భారీ సక్సెస్ అందించిన ప్రశాంత్ వర్మతో జాంబీ రెడ్డి, దానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అలాంటిది వీరు సెపరేట్ అయ్యారు అనేది నిజం కాకపోవచ్చు. మరి దీనిపై ఓ క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.
Jai Hanuman Shoot Update – మరి షూట్ పరిస్థితి ఏంటి?
జై హనుమాన్ ఎప్పుడు నుంచో మొదలు కావాల్సి ఉంది కానీ రిషబ్ శెట్టి కాంతార 1 లో బిజీగా ఉండడం మూలాన ఇది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఫ్రీ అయ్యారు కాబట్టి ఈ కొత్త ఏడాదిలోనే షూటింగ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
