ఒక్క ఇండియా నుంచే ‘ధురంధర్ 2’ 1000 కోట్లు కొట్టేసిందా?

Dhurandhar-2

పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ సినిమాల్లో ఒకటిగా లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ధురంధర్ 2. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. అయితే ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1500 కోట్లకి పైగా గ్రాస్ ని క్రాస్ చేయగా ఇప్పుడు ఒక్క ఇండియన్ బాక్సాఫీస్ నుంచే ఏకంగా 100 కోట్ల గ్రాస్ ఈ సినిమాకి వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో భారత దేశ వ్యాప్తంగా 1000 కోట్లు అందుకున్న అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా ధురంధర్ 2 రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి లాంగ్ రన్ పరంగా కూడా చాలామంది ఎగ్జైటెడ్ గానే ఉన్నారు. బాహుబలి 2, దంగల్ లాంటి సినిమాలు రికార్డులు ఇది క్రాస్ చేస్తుంది అని నమ్ముతున్నారు. మరి వాటిని ఈ సినిమా క్రాస్ చేస్తుందో లేదో చూడాల్సిందే.

Exit mobile version