మనోజ్ – తేజ ‘మిరాయ్’ టీజర్ రిలీజ్ అప్పుడే !

Mirai 1 1

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న “మిరాయ్” సినిమాలో తేజ సజ్జతో పాటు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఈ చిత్రం ఆసక్తికరమైన అప్‌డేట్‌ తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా టీజర్‌ను మే 28న, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు, ఓ క్రేజీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఐతే, ఆసక్తికరంగా, ఈ టీజర్ పోస్టర్‌లో సినిమా విడుదల తేదీ లేదు.

మరి ఈ సినిమా ఆగస్టు 1న, 2025న థియేటర్లలోకి వస్తుందా ? లేదా ?, లేక రిలీజ్ తేదీ మారుతుందా ? అనేది చూడాలి. కాగా ఈ సినిమా మొత్తం మనోజ్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని.. పైగా మనోజ్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని.. అందుకే ఈ పాత్రను కార్తీక్ ఘట్టమనేని చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్. ఆ మధ్య మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ లో సాలిడ్ యాక్షన్ లుక్ లో.. కత్తి పట్టుకొని “ది బ్లాక్ స్వార్డ్” గా మనోజ్ హైలైట్ అయ్యాడు. అన్నట్టు ఈ చిత్రానికి గౌర హరీష్ నే సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version