హీరోగా బ్రహ్మాజీ తనయుడు

shajeevikumar
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజీవ్ కుమార్ త్వరలో హీరోగా అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. మొదట సినీ రంగంలోకి రావడానికి సంజీవ్ ఆసక్తి చూపలేదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో సంజీవ్ ను చూసిన ఓ యువ దర్శకుడు, నా సినిమా నటిస్తావా అని అడగడంతో మెల్లగా ఇటువైపు అడుగులు వేశాడు. ప్రస్తుతం మర్చెంట్ నేవీలో సంజీవ్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడు.

త్వరలో సంజీవ్ తొలి సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఒక ప్రముఖ దర్శక నిర్మాత సంజీవ్ ను హీరోగా లాంచ్ చేయనున్నారు. కుమారుడిని హీరోగా నిలబెట్టడం కోసం బ్రహ్మాజీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది సంజీవ్ కు ఫ్యాషన్ డిజైనర్ తో వివాహం అయ్యింది.

Exit mobile version