ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఓటిటిల ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓటిటి ఎంట్రీతో బిగ్ స్క్రీన్ సినిమాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని చాలామంది అనుకున్నారు కానీ తర్వాత దీని ఎఫెక్ట్ సినిమా రిలీజ్ డేట్ లు డిసైడ్ చేసేవరకు వచ్చింది. అలాగే నాలుగు వారాలు ఎనిమిది వారాల ఓటిటి రిలీజ్ గ్యాప్ పై ఎప్పుడు నుంచో రచ్చ నడుస్తుంది.
సినిమా థియేటర్స్ లో వచ్చిన నాలుగు వారాలకే ఓటిటికి రావడం కొందరికి ఇబ్బంది అయితే కొందరికి అదే క్యాష్. ఈ నేపథ్యంలో థియేటర్స్ లో ఆడియెన్స్ కి రావడం లేదు అని కొందరు మొర పెట్టుకుంటుంటే ఇంకోపక్క తమకి 4 వారాలే చాలు అని అంటున్నారు. ఇలా ఇటీవల దక్షిణాది సినిమా నిర్మాతల అసోసియేషన్ పెట్టడం కూడా జరిగింది.
అయితే ఇందులో తెలుగు, తమిళ నిర్మాతలు 8 వారాల ఓటిటి రిలీజ్ కి బిగ్ నో చెప్పేశారట. కేవలం 4 వారాలు చాలు అని వారు చెబుతున్నట్టు తెలుస్తుంది. దీనితో మళ్ళీ తంతు మొదటికే వచ్చింది అని చెప్పాలి. సో భవిష్యత్తులో సౌత్ సినిమా నుంచి ఇదే 4 వారాల ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పవచ్చు.
