
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వచ్చేసింది. ఈ సంవత్సరంలో జరిగే సిసిఎల్ 5 క్రికెట్ సమరానికి ఇండియాలో ఉన్న అందరు హీరోస్ సిద్దమవుతున్నారు. ఈ సిసిఎల్ 5 సీజన్ చాంపియన్ షిప్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఇప్పటికే స్టార్స్ అంతా కలిసి చెమట చిందిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ లో భాగంగా తెలుగు వారియర్స్ – ముంబై ముంబై వాంఖేడే మధ్య ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జరిగింది.
తెలుగు వారియర్స్ టీంకి విక్టరీ వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హైదరబాద్ ప్రాక్టీస్ సెషన్స్ ని చాముండేశ్వరినాథ్ – ప్రతాప్ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలుగు వారియర్స్ టీంలో అఖిల్, నిఖిల్, సుశాంత్, సాయి ధరమ్ తేజ్, సుదీర్ బాబు, ప్రిన్స్, ఆదర్శ్ తదితరులు ఆడుతున్నారు. ఈ చాంపియన్ షిప్ లో హీరోలు మాత్రమే కాకుండా పలు ఇండస్ట్రీల హీరోయిన్స్ కూడా సందడి చేయనున్నారు.