ఈ సంక్రాంతికి తెలుగులో ఎఫ్ 2, తమిళ్ లో విశ్వాసం చిత్రాలతో ఒకేసారి సూపర్ హిట్స్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు రచయిత ‘ఆదినారాయణ. తెలుగులో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలకు…తమిళ్ లో వీరమ్, వేదాళమ్, వివేగం, విశ్వాసం..చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసి వరుసగా విజయాలు సాధించిన తెలుగు రైటర్ ఆది నారాయణ. దీంతో ఆదినారాయణ తెలుగు, తమిళ్ రెండు భాషా చిత్రాలలో బిజీ అయ్యారు.
ఆదినారాయణ స్వగ్రామం అమలాపురం దగ్గర ఈదరపల్లి. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తదుపరి చిత్రానికి, శౌర్యం శివ తదుపరి చిత్రానికి, కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే మూవీకి వర్క్ చేస్తున్నారు.