
శుక్రవారం ఉదయం హైదరాబాద్ మల్లిఖార్జున థియేటర్లో జరిగిన ‘టెంపర్’ బెనిఫిట్ షోలను ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ ఆర్గనైజ్ చేశారు. షోయింగ్ బిజినెస్ కంపెనీ స్థాపించిన కార్తికేయ పలు సినిమాలకు పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే, ఈ బెనిఫిట్ షో ఆర్గనైజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటో ఎవరి అర్ధం కాలేదు. పలువురు ఈ విషయంపై చరించుకున్నారు కూడా.
రాజమౌళి సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని చారిటికి వినియోగించనున్నారు. ‘కొడాలి చారిటబుల్ ట్రస్ట్’ అధికార ప్రతినిధిగా కార్తికేయ సమాజ సేవ చేస్తున్నారు. ఈ డబ్బులను ఆ సంస్థకు ఇవ్వనున్నారు.
మల్లిఖార్జున థియేటర్లో జరిగిన ‘టెంపర్’ బెనిఫిట్ షోకు రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు హాజరయ్యారు. అందరి నోటా సినిమా గురించి ఒకటే మాట వినిపిస్తుంది. ‘టెంపర్’ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తున్నారు.