నైజాంలో రెండో రోజు కూడా అదరగొట్టిన ‘టెంపర్’

temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సినిమా ‘టెంపర్’. టైటిల్ కి తగ్గట్టుగానే విడుదలైన మొదటి షో నుంచే చూస్తున్న ప్రేక్షకుల్లో ఈ సినిమా టెంపర్ లేపుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల నుంచి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ సినిమా నైజాం లో మొదటి రోజు 2.71 కోట్ల షేర్ సాధించిందని తెలిపాము. రేనవర రోజు కూడా టెంపర్ నైజాం లో 1.5 కోట్ల షేర్ సాధించి బాక్స్ ఆఫీసు ని ఒక ఊపు ఊపేస్తోంది.

మొదటి రెండు రోజుల్లో టెంపర్ మూవీ 4.21 కోట్ల షేర్ సాధించింది. ఆదివారం కూడా ఇదే స్థాయి కలెక్షన్స్ నమోదవుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నైజాంతో పాటు గుంటూరు, వైజాగ్ కి చెందిన మొఅరి రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు కూడా మీకందిస్తున్నాం.

‘టెంపర్’ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ డీటైల్స్

నైజాం – 4.21కోట్లు
గుంటూరు – 1.57కోట్లు
వైజాగ్ – 1.11కోట్లు

యంగ్ టైగర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ తోడవడంతో థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version