
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చి సడన్ గా ఆగిపోయింది. దానికి కారణం ఇటీవలే హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ చనిపోవడం. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్.టి.ఆర్ తిరిగి ఈ రోజు నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడని రెండు రోజుల క్రితమే తెలియజేశాం. కానీ తాజా సమాచారం ప్రకారం షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు కాలేదు. పలు కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా, రేపటి నుంచి బేగం పెట్ లో వేసిన స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలు కానుంది
ఈ ఫైనల్ షెడ్యూల్ తో దాదాపు సినిమా మొత్తం పూర్తవుతుంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచే తక్కువ టైంలో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఫిబ్రవరి మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు. టెంపర్ లో ఫస్ట్ లుక్ లో ఎన్.టి.ఆర్ సరికొత్త మేకోవర్ తో స్టైలిష్ లుక్ లో కూడా కనిపించాడు. ఆ లుక్ కి సంబందించిన ఫోటోలు ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.