
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. గత రెండు రోజులుగా ఈ చిత్ర టీం రాత్రి పగలు కష్టపడి ఫస్ట్ కాపీని రెడీ చేసారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఫస్ట్ కాపీని ఈ రోజు సెన్సార్ కి పంపింది. కొద్ది సేపటి క్రితమే’టెంపర్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రప్రంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ మరియు ఎన్.టి.ఆర్ ని చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని సమాచారం. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బ్లాక్ బస్తర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాని అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తన టీంతో కలిసి కంటిన్యూగా పనిచేస్తున్నారు.