అఫీషియల్: మాస్ పోస్టర్ తో ‘జన నాయగన్’ డేట్ వచ్చేసింది.. ఇతర వెర్షన్ లు ఉన్నాయా మరి?

ప్రస్తుతం కోలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే ‘జన నాయగన్’. ఇళయ దళపతి అలాగే ఇప్పుడు తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమా ఇదే కాగా దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలయ్య సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ గా చేసిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ అలా వాయిదా పడుతూ సస్పెన్స్ గా మారింది.

కానీ ఎట్టకేలకి అభిమానులు ఎదురు చూస్తున్న ఆ బిగ్గెస్ట్ అప్డేట్ ఇపుడు విజయ్ రివీల్ చేసాడు. తనది పోలీస్ లుక్ లో ఉన్న ఓ మాస్ పోస్టర్ తో విజయ్ ఈ చిత్రంని జూలై 23న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఇపుడు విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ సినిమాని మేకర్స్ ఒక్క తమిళ్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీలో కూడా మొదట అనౌన్స్ చేశారు.

కానీ మధ్యలో వచ్చిన గ్యాప్ తో ఈ వెర్షన్ లో రిలీజ్ లు ఉన్నాయా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉండిపోయింది. కానీ ఫైనల్ గా దీనిపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. తెలుగులో ‘జన నాయకుడు’, హిందీ వెర్షన్ ‘జన్ నేతా’ వెర్షన్ లను కూడా విడుదల చేస్తున్నట్టు నేడు ఖరారు చేశారు. సో మొత్తం మూడు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version