‘చుట్టాలబ్బాయి’కి రికార్డింగ్ మొదలుపెట్టిన థమన్!

‘చుట్టాలబ్బాయి’కి రికార్డింగ్ మొదలుపెట్టిన థమన్!

Published on Aug 5, 2015 7:45 PM IST

s-s-Thaman
తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని టాప్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ సెన్సేషన్‌గా మారిపోయిన సంగీత దర్శకుడు థమన్. ప్రస్తుతం చేతిలో పలు పెద్ద సినిమాలను పెట్టుకొని దూసుకుపోతోన్న ఈ యువ సంగీత దర్శకుడు ఆది హీరోగా రూపొందనున్న చుట్టాలబ్బాయ్ సినిమాకు ఓకే చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్‌ను ఈ రోజే మొదలుపెట్టారు.

‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం.. ఆది ‘చుట్టాలబ్బాయి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

గత నెలలో వైభవంగా లాంచ్ అయిన ఈ సినిమా ఈ నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వీరభద్రం తన స్టైల్లోనే ఆదికి సరిపడే మంచి కామెడీ సబ్జెక్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక పాటల రికార్డింగ్ మొదలైన సందర్భంగా వీరభద్రం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. చెన్నైలో చుట్టాలబ్బాయి పాటల రికార్డింగ్ ఈ రోజే మొదలైందని, థమన్ మంచి ట్యూన్స్ అందించాడని తెలిపారు. వెంకట్ నిర్మాణంలో రూపొందననున్న ఈ సినిమాలో ఆది సరసన ప్రణీత హీరోయిన్‌గా హీరోయిన్‌గా నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు