సంగీత దర్శకుడు థమన్ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘గాయత్రి, భాగమతి, తొలిప్రేమ, ఇంటిలిజెంట్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈయన చేతిలో నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలు ఉండగా ఇప్పుడు మరొక పెద్ద ప్రాజెక్టుకు సైన్ చేశారాయన.
ఈ ప్రాజెక్ట్ మరేవిటో కాదు మాస్ మహారాజ రవితేజ, శ్రీను వైట్లల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందివ్వనున్నాడు. ఈ సినిమాలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
