సూర్య ‘మాస్’ లో తమన్ సర్ప్రైజ్ ఎలిమెంట్.!

SS-thaman-surya
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్’. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి వెంకట్ ప్రభు డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తోంది యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి మాస్ ద్వారా తమన్ అందించబోయే సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.? ఆ సస్పెన్స్ ఏమిటంటే ఎస్ఎస్ తమన్ ‘మాస్’ కోసం ఓ స్పెషల్ మాస్ సాంగ్ ని కంపోజ్ చేసాడు. అనగా తమన్ ఈ సినిమాకి గెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అనమాట.

ఇప్పటికే ఫుల్ బీట్స్ ఉన్న ఓ మాస్ సాంగ్ ని తమన్ కంపోజ్ చేసాడు. ఈ పాటని ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఏప్రిల్ 7 కల్లా చూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ మధ్యలో రిలీజ్ చేసి, మే 1న సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్య సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నయనతార, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి తెలుగులో రిలీజ్ చెయ్యడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version