‘డాకు మహారాజ్’ ఒరిజినల్ సౌండ్‌ ట్రాక్ పై తమన్ కొత్త హామీ !

దక్షిణాది చిత్రసీమలో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు; త్వరలో ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతున్నారు. అయితే, ‘డాకు మహారాజ్’ ఒరిజినల్ సౌండ్‌ ట్రాక్ (OST) విడుదలను పదేపదే వాయిదా వేయడంపై తమన్ పై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనికితోడు గత ఏడాదిన్నర కాలంలో అనేకసార్లు ప్రకటించిన విడుదల తేదీలను పోస్ట్ ఫోన్ చేయడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు.

మొత్తానికి ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒరిజినల్ సౌండ్‌ ట్రాక్ ని తన పుట్టినరోజైన 2026 నవంబర్ 16న విడుదల చేస్తానని తమన్ తాజాగా హామీ ఇచ్చారు. ఈ వార్తతో బాలకృష్ణ అభిమానులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ, గతంలో జరిగిన జాప్యాల దృష్ట్యా చాలామందిలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ఈసారైనా తమన్ తన మాట నిలబెట్టుకుంటారా ? లేక మరోసారి తేదీని వాయిదా వేస్తారా ? అనేది చూడాలి.

Exit mobile version