పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ !

tammareddy bharadwaj

టాలీవుడ్ లో తమ్మారెడ్డి భరద్వాజ అంటే ఓ పెద్ద మనిషి. పైగా మంచి చెడ్డలు చెప్పే అలవాటు ఉన్న ఆయన.. తాజాగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ జార్జిరెడ్డి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు. జార్జిరెడ్డిగా పవర్ స్టార్ చేస్తే ఎలా ఉండేది ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయని అభిమానులు ఫీల్ అవుతున్నారు అన్నట్లు యాంకర్ అడిగిన ప్రశ్నకు భరద్వాజ సమాధానమిస్తూ.. జార్జ్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు, జార్జ్ రెడ్డి చెప్పింది చేసే వాడు. కానీ, పవన్ కళ్యాణ్ చెప్తాడు గాని చెయ్యడు. ఇప్పటివరకూ అయితే ఏమి చేయలేదు కదా.. ట్విట్టర్ లో పోస్ట్ లు పెడతాడు, 3 నెలలకు 6 నెలలకు వచ్చి మళ్ళీ మాయం అవుతాడు’ అని చెప్పుకొచ్చారు.

మరి పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఈ వ్యాఖ్యల పై పవన్ ఎలాగూ రియాక్ట్ అవ్వడు. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. గతంలో ఇలాంటి కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు చాల వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు.

https://mobile.twitter.com/amarballa2/status/1198248117541330944

Exit mobile version